Tuesday, March 10, 2026

జన ప్రతిధ్వని వేదిక’ (ఎన్జీఓ) మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా మధురిమ నియామకం

నేటి సాక్షి – జగిత్యాల
( రాధారపు నర్సయ్య )

‘జన ప్రతిధ్వని వేదిక’ (ఎన్జీఓ) స్వచ్ఛంద సంస్థ అనుబంధ కమిటీలోని మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా మధురిమ నియామకం అయ్యారు.

సోమవారం రోజున సంస్థ రాష్ట్ర అధ్యక్షులు బాస మహేష్..మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా కోరుట్ల పట్టణానికి చెందిన గాండ్ల మధురిమ ను నియమిస్తూ నియామక పత్రం జారీ చేశారు. వీరి నియామకం వెంటనే అమలులోకి వస్తుందని మహేష్ నియామక పత్రంలో పేర్కొన్నారు. ఈ నియామకం సందర్బంగా మధురిమ మాట్లాడుతూ..తనపై నమ్మకంతో పెట్టిన బాధ్యతకు న్యాయం చేయుటకు రాష్ట్రములో మహిళలకు జరుగుతున్న అన్యాయాల పై ఎప్పటికప్పుడు చట్టపరమైన సలహాలు సూచనలు తీసుకుంటూ బాధితులకు అండగా నిలవడంతో పాటు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జన ప్రతిధ్వని వేదక (ఎన్జీఓ) స్వచ్ఛంద సంస్థ బలోపేతానికి ఆశయాల సాధనకు ఎల్లవేళలా కృషి చేస్తానని మధురిమ తెలిపారు.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News