నేటి సాక్షి మహబూబాబా ద్ నర్సింహులపేట (భూక్యా రవి నాయక్) నవంబర్ 11మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ పాశం బుచ్చి రెడ్డి గారు ఈ మధ్యకాలంలో స్వర్గస్తులైనారు. ఆయన మరణ వార్త తెలిసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డ్యా నాయక్ గారు, నెలకుర్తి నరసింహారెడ్డి, నెలకుర్తి సత్తిరెడ్డి, కసిరెడ్డి లింగారెడ్డి, జంపాల బిక్షం, వెంకట్ రెడ్డి, వీరా రెడ్డి, శేషయ్య, పోసాల శ్రీనివాస్, చందు వినయ్, ముత్యం వెంకటేశ్వర్లు, వీరబోయిన సురేష్, రావుల శ్రీనివాస్, జంపాల వెంకన్న తదితరులు ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అందరూ ఆకాంక్షించారు.





