నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 22~అన్నమయ్య జిల్లా :- జననేత వైయస్ జగన్ జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి జననేతగా పిలిపించుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాలు మేరకు పట్టణాలకు దీటుగా పల్లెలోను తగ్గేదేలా అన్నట్టు ఇంటింటా ఓ పండుగల ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలు ప్రజల భాగస్వామ్యం తో ఘనంగా జరగడం హర్షనీయం. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం హర్షించదగ్గ విషయమని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని శాసనసభ్యులు, ఇంచార్జులు తరిలొచ్చి వైసీపీ శ్రేణులతో, కార్యకర్తలతో, అక్క చెల్లెమ్మలతో, ప్రజలతో మమేకమై పాలు పంచుకోవడం ఆనందనీయమన్నారు. ప్రతి చోట భారీ కేక్‌లను కట్ చేసి హ్యాపీ బర్త్‌డే జగనన్న అంటూ నినాదాలు చేస్తూ ఆయన పేరిట రక్తదాన శిబిరాలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, ఆసుపత్రులలో పాలు పండ్లు పంపిణీ చేసి జగన్ పై ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతను చాటుకున్నారు. జగనన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. గ్రామాల కట్టుబాట్లకు అనుగుణంగా వివిధ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణతో గ్రామస్తులను అబ్బురు పరిచారు. పలుచోట్ల కోలాటాలు ఆడుతూ వైసీపీ జండాలను ప్రదర్శిస్తూ కనువిందు చేశారు. జగన్ జన్మదిన సందర్భంగా పలు చోట్ల విద్యార్థులకు విద్యా సామాగ్రి ఉచితంగా పంపిణీ చేసి విద్యార్థుల చేతుల మీదుగా కేకులను కట్ చేయించి వాళ్లకు తినిపిస్తూ స్వీట్లు పంచారు. అలాగే పేదలకు నిత్యావసర సరుకులు అందజేసి జననేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం వైఎస్ జగన్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆయనపై మమతానురాగాలు పంచుతూ ఆయనపై మాకు ఎల్లప్పుడూ ఇలాగే అభిమానము ఉంటుందని చాటి చెబుతూ అపూర్వ సంఘీభావం తెలిపారు. సంక్షేమ – అభివృద్ధి పాలనకు చిరునామా వైఎస్ జగన్.. ————————- 2019–2024 మధ్య కాలంలో వైఎస్ జగన్ పాలన రాష్ట్ర చరిత్రలోనే మైలురాయిగా నిలిచిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలతో మమేకమై పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం, ప్రతి గడపను తాకిన నాయకుడు జగన్ అని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2,83,866 కోట్లకు పైగా నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించారని తెలిపారు. 2.60 లక్షల వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం జగన్ పాలనకు నిదర్శన మన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 60 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టి, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.25 లక్షల వరకు విస్తరించి పేదలకు మెరుగైన వైద్యం అందించా రన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించి పాలనను ప్రజలకు చేరువ చేశారని, నాడు – నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చారన్నారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, వసతిదీవెన, విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. 17 మెడికల్ కళాశాలలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కుల, మత, పార్టీ భేదం లేకుండా అర్హతే ప్రమాణంగా పెన్షన్లు, పక్కా గృహాలు సహా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన నిజమైన సంక్షేమ సారధి వైఎస్ జగన్ అని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.జగనన్న జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.. —————————–జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో పల్లె పట్టణ గ్రామాల్లో అత్యంత ఘనంగా నిర్వహించి విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, యువతకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పిలుపుకు స్పందించి భారీ సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఐక్యత, ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు..వైసీపీ శ్రేణుల ఆసక్తికర వ్యాఖ్యలు..————————మీరు గెలిచినా రోజు వచ్చిన అభిమానం కాదు.దేశంలో ఉన్న పెద్ద నాయకులందరూ కలిసి మిమ్మల్ని నాశనం చేద్దామనుకున్న రోజు వచ్చిన అభిమానం. ఈ అభిమానం మాతోనే మట్టిలో కలిసిపోవాలి తప్ప ఎక్కడికి పోదు. జగన్ అన్నా నువ్వు ఓడిపోయావని గేలి చేస్తున్న ప్రతి ఒక్కడికి కనువిప్పుగా, లోలోపల కుళ్ళుకుంటూ కుషించేలా నీ ప్రతి అభిమాని, నీ ప్రతి కార్యకర్త నిర్వహించిన మీ పుట్టినరోజు వేడుకలే నిదర్శనమన్నారు. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు మాత్రం ఎవర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్ అంతే. గెలిచినా ఓడిన మా నాయకుడివి. మేము నమ్మిన మా నాయకుడు వైయస్ జగన్ అంటూ పేర్కొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





