నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జర్నలిస్టు అరెస్టుకు నిరసనగా గా శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహశీల్ చౌరస్తాలో జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజె.జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇతెనాల్ ఫ్యాక్టరీ పై వాతావరణ కాలుష్యంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత దృష్టిలో ఉంచుకొని హైదరాబాదుకు చెందిన జర్నలిస్టు రెహమాన్ రాసిన కథనంపై పోలీసులు కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా జర్నలిజాన్ని పత్రికలను అణచివేసి వేసే దిశగా పోలీసులు కుట్ర పన్ని రహమాన్ పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. జర్నలిస్ట్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసే వరకు నిరసన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో, టి.యు.డబ్ల్యూ.జె. ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి మొరపల్లి ప్రదీప్ కుమార్ లతో పాటు, పాత్రికేయులు సంపూర్ణ చారి, రాజేందర్ రెడ్డి, శ్రీధర్ రావు, అంజయ్య,సిరిసిల్ల వేణుగోపాల్,బి.రాజేష్, షఫీ, మారుతి,నారాయణరెడ్డి, హరికృష్ణ, హైదర్, సంబురాజి రెడ్డి, సామ మహేష్, ఇక్రముద్దీన్, గాజుల మహేష్, లు పాల్గొన్నారు.______________

