- – అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
- – త్వరలోనే ఇండ్ల స్థలాలకు ఓ పాలసీ
నేటి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ర్ట తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ర్టంలో కాంగ్రెస్ సర్కారు, ప్రజాపాలన వచ్చేందుకు జర్నలిస్టులు కృషి చేశారని చెప్పారు. హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన జీవోను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నట్టు చెప్పారు. వందశాతం జర్నలిస్టులకు అండగా ఉంటామని అన్నారు. అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున దానిని మూడు నెలలకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వల మేరకు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్లు అయిన కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

