Tuesday, March 17, 2026

*జర్నలిస్టుల సంరక్షణ చట్టం అమలు చేయాలి**జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందజేయాలి* *జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి*—————————————జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు, సంక్షేమ ఫలాలు అందించాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరునగరి శ్రీనివాస్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను కోరారు.ఈ సందర్బంగా గురువారం జగిత్యాలలో కిషన్ రెడ్డి, శ్రీనివాస్ లు మాట్లాడుతూ తెలంగాణలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడీటేషన్లు వెంటనే ఇవ్వాలని, ప్రతి మూడు నెలలకోసారి పొడిగించకుండా వెంటనే అక్రిడీటేషన్ కమిటీలను నియమించి జనవరి మొదటి రోజున కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు.రైల్వే పాసులను పునరుద్దరించాలని, హెల్త్ కార్డులివ్వాలని,కోర్టు తీర్పు పేరుతో కాలయాపన చేయకుండా జగిత్యాల జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా జిల్లా కలెక్టర్ కూ ఆదేశాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి, శ్రీనివాస్ లు కోరారు. ఇటీవల జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనీ వారు ప్రభుత్వానికి విన్నవించారు. జర్నలిస్టులకూ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందించేలా ముఖ్యమంత్రి, మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లాలోని ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు చొరవ చూపాలని కిషన్ రెడ్డి, శ్రీనివాస్ లు కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News