**నేటి సాక్షి చిలుకూరు .. చిలుకూరు మండల. బేతవోలు గ్రామం లో కనకదుర్గమ్మ జాతర శివరాత్రి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజుల బండలాగుట ప్రదర్శన ను శుక్రవారం కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల పందాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు మొదటిరోజు పాల పండ్ల ఎడ్ల పందేలు జరిగినాయి రెండో రోజు మూడో రోజులు శని ఆదివారం నాలుగు పళ్ళ ఎడ్ల విభాగం ఆరుపళ్ళ ఎడ్ల విభాగం ఆదివారం న్యూ కేటగిరి ఎడ్ల పందాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు జాతీయస్థాయి ఎడ్ల పందేలు లలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య ఉప సర్పంచ్ ఏడుకొండలు మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీపీలు కాంగ్రెస్ నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు…

