Wednesday, March 11, 2026

జాతీయ ఉపాధి హామీ పనుల పరిశీలన మరికల్ ఎంపీడీవో పృథ్విరాజ్…..

నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 23, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని రైల్వే స్టేషన్ వెళ్లే రహదారిలో శుక్రవారం నాడు జాతీయ ఉపాధి హామీ పనులను మరికల్ మండల ఎంపీడీవో పృథ్వీరాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూలీలను ఆయన కోరారు. మరికల్ ఎంపీడీవో వెంట మరికల్ మండల ఏపీవో క్షేత్ర సహాయకులు, మరికల్ పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News