నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థి గండ్ర నరహరి జాతీయస్థాయిలో జరిగే ఎస్జీఎఫ్ అండర్–17 ఖో-ఖో విభాగం పోటీలకు తెలంగాణ జట్టుకు ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. తేదీ 21-12-2025 నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న సందర్భంగా శిశు మందిర్లో గండ్ర నరహరిని ఘనంగా సత్కరించారు.*కఠిన శ్రమతోనే విజయం*ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై, గండ్ర నరహరిని అలాగే ఆయన తల్లిదండ్రులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరహరి ప్రతిభను అభినందిస్తూ రూ.5,116/- నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే క్రీడల పట్ల ఆసక్తితో శారీరక శ్రమ చేస్తూ మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయికి చేరుకోవడం ఎంతో కఠినమైన ప్రయాణమని, ఇది నరహరి చేసిన నిరంతర కృషికి ఫలితమని పేర్కొన్నారు. ఇటువంటి విజయాలు ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.అలాగే సంస్కృతి, సంప్రదాయాలు, క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ యాజమాన్యానికి, కమిటీ సభ్యులకు, ఆచార్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.*మా పాఠశాలకు గర్వకారణం*ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శిశు మందిర్ విద్యార్థి జాతీయస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోరుట్ల పట్టణ ఖో-ఖో క్లబ్ సభ్యులు నవీన్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్, లక్ష్మీనారాయణలను అభినందించారు.ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు చెట్పల్లి శంకర్, ప్రబంధకారిణి కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, కోశాధికారి నీలి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొండబత్తి అమర్నాథ్, తాటికొండ విశాల్, కొత్త సందీప్, అలాగే ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.____





