నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):ఎనగల్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గణిత ప్రాముఖ్యతపై ఉపాధ్యాయుల ప్రసంగాలు,విద్యార్థులచే గణిత నమూనాలు, చార్ట్ ప్రదర్శనలు, గణిత ముగ్గులు, గణితంపై ఆసక్తి పెంపొందించే క్విజ్ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.గణితం మన దైనందిన జీవితంలో అనివార్య భాగమని,విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో గణితానికి కీలక పాత్ర ఉందని విద్యార్థులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శీలం సునీతారాణి, ఉపాధ్యాయులు శ్రీరాముల నరేందర్,ప్యారం లక్ష్మినారాయణ, ఎడ్ల కృష్ణ చైతన్య, ఐలవేణి సుస్మిత, చిలుముల కవిత, పల్లి మాధురి పాల్గొన్నారు…





