Wednesday, March 18, 2026

జాతీయ మెగా లోక్-అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి. రాజీ మార్గమే రాజ మార్గం. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర,

నేటి సాక్షి వికారాబాద్:జాతీయ స్థాయి లో జరగనున్న లోక్ ఆధాలాత్ డిసెంబర్ 21, 2025 (ఆదివారం) వరకు జరగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, క్షణికావేశంలో జరిగిన చిన్న తప్పులు, అనవసర వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్-అదాలత్ ఒక ఉత్తమ అవకాశం అని పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న అన్ని రకాల కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో రాజీ పడవచ్చని తెలిపారు.న్యాయ ప్రక్రియల వల్ల కలిగే ఆర్థిక, మానసిక ఒత్తిడులను తగ్గించుకోవడానికి లోక్-అదాలత్ ఎంతో ఉపయోగకరమని, రాజీ ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందని అన్నారు. అనవసర గొడవలకు దూరంగా ఉండి, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.కాబట్టి, ఈ నెల డిసెంబర్ 21వరకు జరగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్‌ను జిల్లా ప్రజలు, కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News