*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక జెడ్ పి హెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులలో దాగివున్న ప్రతిభాపాటవాలను వెలికి తీసి మన నిత్యజీవితంలో సైన్స్ ఏ విధంగా మానవ జీవితానికి ముడిపడి ఉందో సైన్స్ ఉపాధ్యాయులు చక్కగా వివరించారు. అలాగే విద్యార్థినీ విద్యార్థులు దాదాపుగా 46 ప్రదర్శనలు ప్రదర్శించి వాటి యొక్క పనితీరు గురించి చెప్పిన విధానం చూపరులను ఆకట్టుకుంది. అలాగే సైన్స్ రంగంలో శాస్త్రవేత్తలు వారు చేసిన కృషి గురించి, వారు మన సమాజానికి సైన్స్ ఏ విధంగా ముడిపడి ఉందో ఉపాధ్యాయులు చక్కగా వివరించారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ మకిలి దాసు, మండల విద్యాధికారి ఆకుల నర్సయ్య ,ఉప సర్పంచ్ తోపారపు అర్జున్, మాజీ ఉప సర్పంచ్ మధు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు , లక్ష్మణ్, స్వప్న ప్రియ, తదితరులు పాల్గొన్నారు.





