Friday, March 20, 2026

*జిడికే 11 ఇంక్లైన్ లో ఘనంగా 56 వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు*

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)అర్జీ-1 ఏరియా జీడికే 11 ఇంక్లైన్ నందు సింగరేణి స్థాయి 56 వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు నిర్వహించడం జరిగినది. ఇట్టి రక్షణ పక్షోత్సవాలకు ముఖ్య అతిథులుగా సాయిబాబు జియం (సేఫ్టే) కార్ఫోరేట్, తనిఖీ కన్వీనర్ శ్రీ సైదులు జియం ఎన్విరాన్మెంట్ కార్ఫోరేట్, అర్జీ.1 జియం లలిత్ కుమార్, ఎఐటియుసి డిప్యూటి జనరల్ సెక్రటరి మడ్డి ఎల్లయ్య హాజరు అయి రక్షణ జెండాను ఆవిష్కరించటం జరిగింది. అనంతరం ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించి రక్షణ పక్షోత్సవాల ప్రారంభించటం జరిగింది.ముఖ్య అతిథులు మాట్లాడుతూ… ఇట్టి రక్షణ పక్షోత్సవాలు ప్రతి సంవత్సరము మనం మర్చిపోకుండా గుర్తుచేయుటకు ఒక సమీక్షా లాంటిదని ప్రతి ఒక్కరు రక్షణలో ముందుకు సాగుతూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. చేసే పనిలో చిన్న నిర్లక్షం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని రక్షణపై అవగాహనతో పనులు చేసి సంస్థ అభివృద్ధికి పాటు పడాలని తెలిపారు. రక్షణలో అత్యుత్తుమ ప్రతిభ ఉద్యోగులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయటం జరిగింది. సేఫ్టీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి రక్షణ మెరుగు పరుచుటకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో గనిలో రక్షణ మెరుగుపరచుటకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి చర్చించారు. రక్షణ కమిటీ సభ్యులు జిడికే 11 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ 1 సీం కు వెళ్ళి అచ్చటి పనితీరు రూఫ్ మరియు సైడ్ అక్కడ రక్షణకు సంబందించి ఏ విధమైన జాగ్రత్త చర్యలను చేపట్టుచున్నారు తదితర పని ప్రదేశాలను పరిశీలించారు. రక్షణపై ఎంత అవగాహన ఉందో కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జియం సేఫ్టీ ఆర్జీ రీజియన్ మధు సుదన్, యస్. ఓటు జియం చంద్రశేఖర్, ఏజంట్ చిలుక శ్రీనివాస్, పి.శ్రీనివాస్, సముద్రాల శ్రెనివాస్,బి దేశాయ్, మహేందర్, షైక్ కమ్మ్రుద్దిన్,, సునీల్ కుమార్, ఆదినారాయణ, వెంకట స్వామీ, గని మేనేజర్ మల్లేశం, గ్రుఫ్ ఇంజనీర్ రాందాస్, ఫిట్ సెక్రటరి నాయిని శంకర్, యునియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News