– మార్కెట్ కమిటీ డెరైక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి..
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )
రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ డెరైక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి అన్నారు.
బుధవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిలుగు విత్తనాల పంపిణీ కేంద్రాన్ని. మహిళా సంఘాల సి.సి పరుశురాం, విఓఏ పిడుగు రజిత ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరైక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరైక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… జిలుగు విత్తనాలు ఎరువు రూపంలో ఉపయోగపడి, పంట దిగుబడిని పెంచుతాయని తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా రైతులకు ఈ విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీలు పిసరి భూమయ్య, బాధనవేని రాజారాం, గ్రామ కమిటీ చైర్మన్ అంగారకుల మహేష్, నాయకులు జక్కు మోహన్, జక్కు వంశీ,లక్కాకుల గంగస్వామి, కోలా నారాయణ, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

