నేటిసాక్షి, రాయికల్ :
జిల్లా వ్యాప్తంగా రైతులను అయిల్ ఫాం సాగు వైపు ప్రోత్సాహించడంతో ఇప్పటికి వరకు 4వేల7వందల ఎకరాల్లో రైతులు అయిల్ఫాం సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025, -26 సంవత్సరానికి గాను రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో శుక్రవారం ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసారు.గ్రామానికి చెందిన రైతు నీలి మహేందర్ వ్యవసాయక్షేత్రంలో 3.ఎకరాల20గుంటలలో ఎకరాలలో అయిల్ఫాం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగునని తెలిపారు. మొక్కలను 90శాతం సబ్సిడీ పై ఒక్కమొక్కను రూ.20- లకే ఇస్తున్నామని, డ్రిప్ పై 80శాతం నుండి -100శాతం సబ్సిడీ అందిస్తున్నామని వివరించారు. ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.4200లను -చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతుల బెడద ఉండదని తెలిపారు. 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గ ఉద్యాన అధికారి కె. స్వాతి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పెట్టే రైతులకు డ్రిప్ కోసం డిడిలు కట్టిన వెంటనే సబ్సిడీ పై డ్రిప్ పరికరాలు అందచేస్తున్నామని,మండలంలోని ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఉద్యాన అధికారి స్వాతి, లోహియా జిల్లా మేనేజర్ విజయ్ భరత్, క్షేత్ర సిబ్బంది రాజేష్,కుమార్, డ్రిప్ కంపెనీ సిబ్బంది సురేష్, తిరుపతి, రైతులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 27RKL02: వీరాపూర్ లో అయిల్ ఫాం మొక్కలు నాటుతున్న అధికారులు, రైతులు





