నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):*రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే జిల్లాల మండలాల పునర్విభజన తో పాటు జోన్ లను కూడా పునర్విభజించాలని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ అన్నారు. మండలంలోని గుండ్లపల్లిలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గతంలో ప్రకటించిన జోన్ లు అస్తవ్యస్తంగా ఉన్నాయని అన్నారు. జోన్ ల ప్రకటన శాస్త్రీయంగా లేదని అన్నారు. ప్రస్తుత జోన్ ల పునవ్యవస్థీకరణ చేసి ఉమ్మడి జిల్లాలను జోన్ లుగా ప్రకటించాలని అన్నారు. ఉమ్మడి జిల్లాల జోన్ ల ఏర్పాటుచేసి ఉమ్మడి జిల్లాల జోన్ల పరిధిలో బదిలీలు చేపడితే ఉద్యోగులకు పెనుబండారంగా మారిన 317 అలాగే స్పావ్స్ ఉద్యోగుల సమస్యలు తీరుతాయని అన్నారు. ఉమ్మడి జిల్లాల జోన్లు శాస్త్రీయ బద్దంగా ఉంటాయని ఉద్యోగులకు నిరుద్యోగులకు వెసులుబాటుగా ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోన్ల పునర్విభజన చేపట్టాలని అన్నారు.

