* నేటి సాక్షి 13 ఫిబ్రవరి పాములపాడు:- రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము విద్యతోపాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తుందని ఆత్మకూరు కంటి వైద్యులు పి.షేక్షావలి అన్నారు. శుక్రవారము పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్, ఎంపీపీఎస్ పాఠశాలలలో, కొత్త బానకచర్ల జడ్పీహైస్కూల్లో, వేంపెంట జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లా అంధత్వ నివారణ సంఘము ద్వారా వివిధ పాఠశాలలోని, వేంపెంటలో 16 మంది విద్యార్థులకు, భానుముక్కుల-10 మంది విద్యార్థులకు, కొత్త బానకచర్ల పాఠశాల-4గురు విద్యార్థులకు అంతకు ముందు కంటి పరీక్షలు నిర్వహించినవారికి శుక్రవారము ఉచిత అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు స్మార్ట్ ఫోనుకు బానిసలు అయ్యి కంటి చూపు పోగొట్టుకోవడానికి, మెంటల్లీ మానసిక ఒత్తిడికి గురై లేనిపోని అనారోగ్యాలకు కారణం అవుతున్నారన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలని, నిరంతరంగా వాడకూడదని, వాటికి దూరంగా ఉండాలని అన్నారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులు రోజువారి ఆహారంలో పోషక విలువలు మెండుగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని, మరియు పాలు, గుడ్డు, కూరగాయలు, ఆకుకూరలు రోజు తీసుకోవాలని సూచించారు కళ్ళను జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపెంట హెచ్ఎం-మొహమ్మద్ రఫీ భానుముక్కుల హెచ్ఎంలు మనోహర్, శ్రీనివాసులు, కొత్త బానకచర్ల హెచ్ఎం- మక్బూల్ భాష, ఆయా పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

