నేటి సాక్షి ఉప్పల్ అక్టోబర్ 17 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీల నియామకం ప్రక్రియ చేపట్టింది.ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మేల్సీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకాలు జరుగుతున్నాయి. మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం మన ఉప్పల్ నియోజకవర్గంలోని పార్టీ నాయకుల అభిప్రాయాలను సైతం స్వికరించడం జరుగుతుంది ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్సర్వర్ గా డా. అంజలి నింబాల్కర్ రానున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీరస్తు కన్వెన్షన్ శిల్పా శిల్పారామం దగ్గర ఉప్పల్ పదాలలో ఈ కార్యక్రమం జరగనున్నదని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి తెలియజేశారు.




