Friday, March 20, 2026

జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రవేట్ హాస్పిటల్ డయాగ్నస్టిక్ సెంటర్ ల అవగాహన సదస్సు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి స్వర్ణకుమారి.

నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నమోదు కాబడి అల్లోపతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్లు లేదా వారి ప్రతినిధులతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్, HMIS గురించి ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నమోదు కాబడి అల్లోపతి వైద్య సేవలు, ల్యాబ్ సర్వీసెస్ అందిస్తున్న ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వారు రోజువారీగా వారు అందించిన సేవలను, పేషంట్ వివరాలను IHIP పోర్టల్ నమోదు చేయాలని, ఆసుపత్రి లేదా ల్యాబ్ లలో ఉన్న మౌలిక సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది వివరాలు HMIS పోర్టల్ ప్రతి నెల నమోదు చేయాలని సూచించారు. ఈ విధంగా నమోదు చేయడం వలన జిల్లాలో తరచుగా వస్తున్న వ్యాధులు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక ప్రణాళిక ప్రకారం పని చేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. కాబట్టి అన్ని ఆసుపత్రిల వారు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలను తనిఖీలు చేసి గుర్తించి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం జరిమానా, సీజ్ చేయడం తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. IHIP, HMIS పోర్టల్ లో నమోదు చేయాల్సిన వివరాలు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఏం & ఏచ్ ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ గోపాల్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News