నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 6కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపడుతున్నటువంటి సమ్మె 16వ రోజుకు చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో చర్చలకు పిలువగా కాగజ్నగర్ మున్సిపల్ కార్మికుల యూనియన్ ప్రధాన నాయకత్వం చర్చల్లో పాల్గొంది. చర్చల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో కార్మిక సంఘం సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ చర్చల్లో భాగంగా వారికి వివరిస్తూ కాగజ్నగర్ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు గత 5 నెలల నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని బకాయిలో ఉన్న పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ 2 కోట్ల రూపాయలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ .పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోని పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులకు గత 5 నెలల నుండి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కాగజ్నగర్ మున్సిపల్ లో పనిచేసే కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేస్తే తప్ప గాని వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారుల తీరు మారే పరిస్థితి లేదు. తేదీ :3 జనవరి 2026 న ఉదయం 9 గంటల నుండి ప్రారంభం అయినా మున్సిపల్ కార్యాలయ ముట్టడి. నేటి వరకు కొనసాగుతూనే ఉందని కార్మికులకు ఎకౌంట్లో 5 నెలల వేతనాలు పీఎఫ్ 2 కోట్లు ఎకౌంట్లో జమ చేయాలని కోరారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ , అడిషనల్ కలెక్టర్ మరియు కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించేలా కృషి చేయాలని చర్చల్లో మాట్లాడగా దీనికి స్పందించిన జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ మరియు జిల్లా ఉన్నత అధికారులు మాట్లాడుతూ కాగజ్ నగర్ మున్సిపల్ పట్టణంలో నీటి కొరత ఉందని మునిసిపల్ లో పనిచేస్తున్న వాటర్ మెన్ పంప్ ఆపరేటర్ లో నీటిని వదలకుండా బందు చేయడం సరైంది కాదని దీనివలన పట్టణంలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వీధుల్లో చెత్త పేరకపోయిందని విధుల్లో చేరి శుభ్రపరచాలని అన్నారు మూడు రోజుల తర్వాత ఒక నెల వేతనం చెల్లిస్తామని మార్చిలో మిగతా వేతనాలు పిఎఫ్ బిల్లులు చెల్లిస్తామని వెంటనే సమ్మె ఆపి విధుల్లోకి చేరుకోవాలని తెలుపడం వలన కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్న పీఎఫ్ 2 కోట్ల రూపాయలు చెల్లించేంతవరకు సమ్మెను ఉధృతం చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జరుగుతున్న సమ్మె లో భాగంగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మున్సిపల్ కార్మికులకు తమ మద్దతును తెలియజేస్తూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు చేస్తున్న పోరాటంలో తమ వంతు సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్దతు తెలియజేసిన తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నగరం పద్మ మరియు జిల్లా నాయకులు దుర్గం అనిత లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరియు సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి వెలిశాల క్రిష్ణమాచారి, మరియు.మున్సిపల్.యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్ మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్ రఫిక్ ఈశ్వరమ్మ ముందం శ్రీనివాస్ లింగమూర్తి, సి హెచ్ తార ప్రియదర్శిని శంకరమ్మ శ్యామల నాసిర్ ప్రవీణ్.అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

