నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి, డిసెంబర్ 30 : జిల్లా కోర్టు కాంప్లెక్స్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొరకు దామినేడు వద్ద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఆర్ డి ఓ రామ్మోహన్, రెవెన్యూ, నీటిపారుదల, ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి తో పాటు చుట్టూ పక్కల గల ప్రాంతాల అభివృద్ధి కొరకు చేయాల్సిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ ప్రతిపాదిత రహదారికి సమీపంలో ఉన్న ఇతర భూములన్నింటికీ అవకాశం కల్పించడం కోసం 30 మీటర్ల రహదారి నిర్మాణానికి సంబంధించిన దామినేడు మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ను పరిశీలించి త్వర్గా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ వెంట తుడా సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈ.ఈ. రవీంద్ర,.పి.ఓ. దేవి కుమారి, ఈ. ఈ. శివారెడ్డి, రూరల్ తహసీల్దార్ జనార్దన్ రాజు, తదితరులు ఉన్నారు

