Monday, March 16, 2026

జిల్లా జర్నలిస్ట్ క్రికెట్ టీం కు కలెక్టర్ అభినందనలు

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి,అక్టోబర్ 14:అనంతపురం అంతర్జాతీయ ఆర్డిటి స్టేడియం వేదికగా అక్టోబర్ 5, 6,7, 8 తేదీలలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(జేశాప్)ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ -2025 టోర్నీలో తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లా జట్టు ఛాంపియన్ గా నిలిచిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అభినందనలు తెలియజేశారు. మంగళవారం జిల్లా క్రికెట్ జట్టు కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీల్లో ఛాంపియన్స్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా జట్టుకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని తెలిపారు. కలెక్టర్ కలిసిన వారిలో జేశాప్ జిల్లా అధ్యక్షులు విజయ యాదవ్, ప్రధాన కార్యదర్శి హరిబాబు, కోశాధికారి నరేష్ రెడ్డి, కెప్టెన్ పులుగూరు శ్రీనివాసులు, క్రీడాకారులు కామేశ్వరయ్య, చిన్నబాబు, వెంకటేష్, మనోహర్, జగదీష్, సుబ్రహ్మణ్యం, సురేష్, ప్రతాప్, నరేష్, మదిఅలగన్, మునిశేఖర్, సతీష్, శ్రీనివాసులు, సాయి తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News