నేటి సాక్షి,గొల్లపల్లి మండలం*గొల్లపల్లి మండలంలోని వెంగలాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి నరేష్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.గత 15 రోజులుగా మండలంలో జరుగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమానికి సంబంధించిన రికార్డు లను పరిశీలించి,పశువులలో వచ్చే సీసనల్ వ్యాధుల పట్ల రైతులకు అవగాహనా కల్పించారు.గొల్లపల్లి మండల వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ 300 లకి పైగా పశువులకి టీకాలు వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో VLO రవీందర్,LSA రాజశ్రీ, రవి, శ్రీకాంత్, నిశాంత్, రమేష్,నర్సయ్య పాల్గొన్నారు.





