Friday, March 20, 2026

*జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు**రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందిద్దాం: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్*——————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………………ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు.భారత రాజ్యాంగం ఆమోదించి 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యానికి మూలాధారం అని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలి అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని చెప్పారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాo గా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సిబ్బంది చే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు,సైదులు RSI లు, డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News