- – భారీ వర్ష సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్
నేటి సాక్షి, వాంకిడి: జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిదంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేశారు.
- భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న నివాసలలో ఉండే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని మరియు జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
- ప్రజలు వాగులు పొంగే రహదారుల్లో ప్రయాణాలు మానుకోవాలని , రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రోడ్లపై వెళ్లే ప్రయాణికులు సాహసాలు చేసి ప్రమాదాలకు గురికావొద్దని,ఆయా ప్రాంతాలలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
- జిల్లాలో 24 గంటల పాటు పెట్రో కార్స్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని, ప్రాణహిత నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నది దగ్గరకు ఈతలకు వెళ్ళరాదని, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి వెళ్లరాదని ఎస్పీ గారు సూచించారు. గ్రామాలలో చెరువులు అలుగుల వద్ద పెద్దలు తమ పిల్లలను నదులలోకి, అలుగుల వద్దకు వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని, వర్షాల దృష్ట్యా పోలీసు అధికారులు సిబ్బంది తమ వెంట ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు రోప్స్, టార్చ్ లైట్స్, ట్యూబ్స్, లైవ్ జాకెట్స్ వెంట ఉంచుకోవాలని ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు.
• జిల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా , రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంబంధిత గ్రామాల సర్పంచ్ లను, మరియు ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. - వర్షాలలో విద్యుత్ స్థంబాలకు ఎర్థింగ్ ద్వారా విధ్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉందని జిల్లా ప్రజలు పిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్థంబాలను కానీ విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా వారిని జాగృతం చేయాలని ,అలాగే విధ్యుత్ సరఫరా లో ఏదైనా లోపం ఉంటే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
•భారీ వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్- 100 కు సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.