నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా కేంద్రం లోగత సంవత్సరం నుండి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వికారాబాద్ జిల్లా కోర్ట్ లో సేవాలాందించి ఒక సంచలనం సృష్టించిన డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డీ బదిలీగా జ్యూడిషల్ అకాడమీ కీ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కోర్టును న్యాయవాదులను ఎన్నడూ మర్చిపోలేనని అదేవిధంగా జిల్లా న్యాయవాదుల సహకారం చాలా అమోఘం అద్భుతంగా డిస్పోజల్ కి సహకరించినారు.ఈ విధంగా వెళ్తే న్యాయవ్యవస్థ మూల సూత్రాలు పదిలంగా ఉంటాయని అంతేకాకుండా, సత్వరమే నూతనంగా శాంక్షన్ అయిన కోర్టు బిల్డింగుకు సంబంధించిన స్థల పరిశీలన విషయాన్ని కూడా పూర్తి చేసి వెళ్ళనున్నారు. జిల్లా న్యావాదుల సంఘం సంయుక్త కార్యదర్శి పి. ఆనంద్ ఆధ్వర్యంలో జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ హాల్ లో వారికీ ఘనంగా సత్కరిస్తూ.. వీడుకోలు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్ర కిషోర్ గారు, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వికారాబాద్, నరసింహ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ తాండూర్ నరేందర్ గారు, సీనియర్ న్యాయవాదులు పరమానంద రావు, కమల్ రెడ్డి , చౌదరి యాదవ్ రెడ్డీ, లవకుమార్ గారు, గోపాల్ రెడ్డీ, సంపూర్ణ ఆనంద్ గారు, అశోక్ కుమార్, జనార్దన్ రెడ్డీ,వసుంధర, సాయికుమార్, యాసీన్ కురేసి, పూజ, అనంతయ్య, ప్ సుధాకర్ రెడ్డీ, జీపీ శ్రీనివాస్ రావు, శుభప్రద్, టీ. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





