నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా కేద్రం లో ప్రభుత్వ వైద్య కళాశాల లో అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సిపిర్ (కార్డియో పల్మనరీ రిసాసిటిషన్) అవగాహన కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పవిత్ర , వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ సుబ్బారెడ్డి వైద్య విద్యార్థులకు సిపిర్ చేసే విధానం గురించి వివరించి సిపిఆర్ ప్రతిజ్ఞ చేయించారు . అనంతరం డాక్టర్ సృజన, డాక్టర్ నిరోషా మ్యాన్, క్వీన్ టాయ్స్ ను ఉపయోగించి సిపిర్ చేసే విధానం గురించి డిమాంస్ట్రేషన్ చేయడం జరిగిoది, ఇద్దరు వైద్య విద్యార్థుల చేత సి పి ఆర్ డేమానిస్ట్రేషన్ చేయించడం జరిగిoది .డి ఏం &ఏచ్ ఓ మాట్లాడుతూ హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితులలో తక్షణ స్పందనగా పక్కనున్నవారు సిపిఆర్ విధానం ద్వారా గుండె పనితీరును కొంతమేర సాధారణ స్థితికి తీసుకు రావచ్చని చాలా సందర్భాలలో రోగికి తక్షణ వైద్య సహాయం అందే వరకు ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్రయత్నం. ఇలా సిపిఆర్ చేసే ప్రయత్నాల వలన 10 శాతం హార్ట్ ఎటాక్ కేసులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు అని తెలిపారు. ఈ సి పి ఆర్ ఫై శిక్షణ అక్టోబర్ 17వ తేదీ వరకు వైద్య సిబ్బందికి, విద్యార్థులకు, వృత్తి నిపుణులకు, సాధారణ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితులు ఎవరికైనా రావచ్చని కాబట్టి ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి అవగాహన ఏర్పరచు కోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి వి. శ్రీనివాసులు, ఎన్సీడీ సమన్వయకర్త జయ రాములు, డి డి ఎం శ్రీనివాసులు, మహమ్మద్ ఆమిర్, వైద్య కళాశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.





