Wednesday, January 21, 2026

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లా వైద్యాధికారుల సమీక్షా సమావేశం. డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ స్వర్ణకుమారి.

నేటి సాక్షి వికారాబాద్ :జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి స్వర్ణకుమారి సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వికారాబాద్,తాండూర్ ఐ ఏం ఏ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య పరిరక్షణకు ప్రైవేట్ వైద్యులు కూడా సహకరించాలని, ప్రతి ఆసుపత్రిలో వైద్యుల వివరాలు, అందించే సేవలు, అందించిన సేవలకు వసూలు చేసే ఛార్జీల వివరాలు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ సాధు సత్యానంద్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రదీప్ గౌడ్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ఎం జయ ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ కార్య వర్గ సభ్యులు డి ఎం హెచ్ ఓ ని శాలువా బొకేతో సన్మానించారు.అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా పరిధిలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వివరాలు మరియు బడ్జెట్ కు సంబంధించిన వివరాలు ఇప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా పరిధిలోని ఏం ఎల్ ఏచ్ పి లతో సమీక్షా సమావేశం ఐ డి ఓ సి మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగినది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లలో అందించే సేవలు ఏ రోజు కా రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని , ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని రకాల సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పవిత్ర, డాక్టర్ వరలక్ష్మి డిప్యూటీ డి ఏం & ఏచ్ ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్, డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News