Tuesday, March 10, 2026

జిల్లా స్థాయిలో బహుమతులు సాధించిన గన్నేరువరం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు

నేటిసాక్షి, గన్నేరవరం, ( బుర్ర అంజయ్య గౌడ్):
అంతర్జాతీయ డ్రగ్ డే సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనంలో గన్నేరువరం మండల కేంద్రం చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఏ.మానస, పత్తి. వైశాలి, బి. అక్షిత,9,10, తరగతి విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గురువారం రోజున కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన బహుమతి ప్రధానం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆలం గౌస్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు. విద్యార్థులకు డ్రగ్ వల్ల కలిగే అనర్థాల గురించి మరియు అవగాహన తెలిపే చిత్రాలు గీయడంతో విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రామయ్య, స్థానిక ఎస్సై నరేందర్ రెడ్డి,ఏఎస్ఐ లక్ష్మీనారాయణ విద్యార్థులను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News