Thursday, March 19, 2026

జిల్లా స్థాయి ఇన్నోవేషన్ మేళా…

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):సిరిసిల్లలో జరిగిన జిల్లా స్థాయి ఇన్నోవేషన్ మేళా లో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జోగాపూర్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి బొల్లం శ్రీవిన్ ప్రథమ బహుమతి సాధించి 3000 రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంస పత్రం అందుకున్నాడు. గైడ్ టీచర్ మేడికాల అంజయ్య నేతృత్వంలో శ్రీ విన్ sustainable grain separation device for small farmers in rural areas అనే యంత్రాన్ని తయారుచేసి ప్రదర్శించినందుకుగాను ఉన్నత పాఠశాలల విభాగంలో Sustainable Agriculture (సుస్థిర వ్యవసాయం)‌ అనే ఉప అంశంలో ఈ బహుమతి లభించింది. గైడ్ టీచర్ అంజయ్య మాట్లాడుతూ “ఈ యంత్రం ద్వారా వరి లేదా గోధుమ పంట నుండి వడ్లు, గోదుమలు సులువుగా వేరు చేయవచ్చు. హార్వెస్టర్ ఖర్చులు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఈ యంత్రం ద్వారా తేలికగా మరియు చాలా తక్కువ ఖర్చుతో పంటలను కుప్ప నూర్చవచ్చు” అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రాజు, పాఠశాల కమిటీ చైర్ పర్సన్ లావణ్య, ఉపాధ్యాయులు మహేష్, జావిద్, గోవర్ధన్, శ్రీనివాస్, పద్మ, నరసయ్య విద్యార్థిని ,గైడ్ టీచర్ ను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News