నేటి సాక్షి జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్ర మగ్గిడి గురుకుల విద్యార్థి శేకల్ల గ్రామం మాజీ సర్పంచ్ కుమారుడు వెల్కటూరు మమతా రమేష్ వార్ల విగ్నేష్ ఈ నెల మెట్టుపల్లి లో నాలుగు తారీకున జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ లో యు -12, 400 మీటర్ పరుగు పందెం లో ప్రతిభ చాటిన మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.ఈ సందర్బంగా గురుకుల పాఠశాల విద్యార్థులు గెలుపొందే ముందడుగు కు సహకరించిన ఉపాధ్యాయులకు పేరెంట్స్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి రమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు ఈ సంతోష్, డి కల్పన, మరియు శేఖల్ల గ్రామ ప్రజలు అభినందించారు.

