నేటి సాక్షి, కొడిమ్యాల నవంబర్, 29, కొడిమ్యాల శనివారంచెకు ముకి సైన్స్ సంబరాలు -2025 టాలెంట్ టెస్ట్ జగిత్యాల జిల్లా స్థాయి లో కోడిమ్యాల మోడల్ స్కూల్ విద్యార్థులు కె అశ్విని,,వి అక్షర,,బి సహస్ర లు ఉత్తమ ప్రతిభా కనబరిచి 2 వ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ బి లావణ్య, చెకు ముకి కో కన్వీనర్ నిషాని మహేందర్,తెలియ జేశారు.ఇవిజయానికి కారణమైనా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కు ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవరచు కొని రాబోవు రోజుల్లో ఇలాంటి విజయాలు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సైన్స్ టీచర్స్ విజయ్ కుమార్,తబస్సుమ్, శ్రీధర్ ,మరియు ఉపాధ్యాయులు రాజేశం,రమణ,శరణ్య,ప్రమోద,శిరీషా, మల్లేశం,భాగ్య లక్ష్మీ, రోహిణి,సౌజన్య,,అంజలి,,సత్యానందం, ,అనూప్,,విద్యార్థులు పాల్గొన్నారు.





