(నేటి సాక్షి ) పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీస్స్టేషన్లో నిర్వహించిన మహా రక్తదాన శిబిరం ఆదర్శప్రాయంగా నిలిచింది. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహాంతి, డీసీపీ సేరేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం 410 మంది రక్తదాతలు రక్తం దానం చేయడం విశేషం.రక్తదాతలకు కృతజ్ఞతగా ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ హెల్మెట్లను బహూకరించారు. రహదారి భద్రతకు సంకేతంగా ఈ కార్యక్రమం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ఈక్విటాస్, రామరాజు ఆసుపత్రి, వాక్సేసన్ పాఠశాలలు సహకరించాయి.రక్తదానం కారణంగా సుచిత్రలోని రష్య్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి ప్రాణాలు నిలిచాయి. చిన్నారికి అరుదైన ఏ నెగెటివ్ రక్తం అవసరమని తెలిసిన వెంటనే జీడిమెట్ల పోలీసులు వెంటనే దాతలను పంపి అమూల్యమైన సేవ అందించారు.సేకరించిన రక్తాన్ని నిమ్స్ బ్లడ్ బ్యాంక్, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీకి అందజేశారు. ఈ శిబిరంలో డాక్టర్ కార్య దీక్ష, టెక్నికల్ ఆఫీసర్ బిడుగు శేఖర్, డీఐ ధనుంజయ, ఎస్సైలు నాయుడు, సత్యనారాయణ, శ్యాంబాబు, పోలీస్ సిబ్బంది, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, డాక్టర్ వేద ప్రకాష్, జమీల్ హైమద్, పర్ష వెంకటరమణ, శైలేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.




