నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాటిపర్తి జీవన్ రెడ్డి అస్వస్థకు గురి కాగా కుటుంబ సభ్యులు వెంటనే జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స చేయించగా మెరుగైన చికిత్స కోసం గురువారం రాత్రి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన వర్గానికి కౌన్సిలర్ టికెట్ల కేటాయింపులోను, ఛైర్పర్సన్ ఎన్నిక విషయంలోనూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు ఆయన వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత ఇబ్బందికి గురయ్యారు.అయితే గురువారం జగిత్యాల నియోజకవర్గంలో వివిద కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి చేరుకున్నారు.ఉన్నటుంది జీవన్ రెడ్డి అస్వస్థతకు గురికాగా వెంటనే సమీపంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ మరింత మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించగా కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా జీవన్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.పరీక్షించిన డాక్టర్లు ఆయనకు బ్లడ్ తక్కువగా ఉందని, అలాగే ఒత్తిడి గురవుతున్నారని చెబుతూ చికిత్స అందిస్తున్నారని తెలిసింది.*జీవన్ రెడ్డి ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్*విషయం తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్థి అని పేర్కొంటూ ఆయన నూరేళ్లు ఆరోగ్యాంగా ఉండాలని, మంచి వైద్యం అందేలా చూస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.*ఆందోళన లో జీవన్ రెడ్డి అభిమానులు*జీవన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కు గురయ్యారు.మాజీ తాటిపర్తి జీవన్ రెడ్డి రెగ్యులర్ మెడికల్ చెకప్ లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లారని,జీవన్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు.

