నేటిసాక్షి, మిర్యాలగూడ (ఫిబ్రవరి 10) : ప్రతి ఒక్కరు జీవవైవిద్యాన్ని కాపాడుకోవాలని, జీవవైవిధ్యం లేకపోతే ప్రతి మనిషి మనుగడ కష్ట సాధ్యమవుతుందని ప్రజాకవి ప్రకృతి కవి జయరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ, విద్యార్థులు మూఢనమ్మకాలు నమ్మకుండా ప్రకృతిలో జరిగే మార్పులను గమనిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రేమికులుగా మారాలని, అప్పుడే సమాజం అభివృద్ధి చెందగలదని అన్నారు. అనంతరం విజ్ఞాన దర్శిని జాతీయ పౌండర్ తాటి రమేష్ మాట్లాడుతూ, పాఠ్యాంశాలలో చదివిన సైన్స్ ని మూఢనమ్మకాలకు జోడించకుండా, సైన్స్ అంటే ఏమిటి అనే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసుకుని, సామాజిక అంశాలతో సైన్స్ కు గల సంబంధాన్ని తెలుసుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షురాలు స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ, సైన్సు అభివృద్ధి చెందని కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక మూఢనమ్మకాలు ఉండేవని, అక్షరాస్యతా అంతగా లేక పేదరికంలో ఉండి మూఢ విశ్వాసాలను ఆనాడు విశ్వసించే వారని, నేటి కాలంలో అక్షరాస్యత పెరిగినప్పటికీ మూఢవిశ్వాసాలు నానాటికి పెరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ బాడీ నేత్రదానం డొనేషన్ గంజి ఈశ్వర లింగం, విజ్ఞాన దర్శిని నాయకురాలు మంగమ్మ, శోభారాణి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, జె కొండల్ రెడ్డి, మరో గ్రంథాల ఉద్యమ నేత కస్తూరి ప్రభాకర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయకుమార్, ప్రిన్సిపాల్ కృష్ణ నాయక్, ఏఐడీఎఫ్ నాయకులు కాశయ్య, వస్కుల మట్టయ్య, అభిద్ భాష, లక్ష్మణ్, అశోక్, నరేష్, మధు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

