“నేటిసాక్షి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవో ఎంఎస్ నెంబర్ 252 ను వెంటనే రద్దు చేసి, జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే-H143 జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 252 జీవో సవరణ కోరుతూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ లు భారీ నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డెస్క్ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన జీఓ 252లోని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. జీఓ 252లో స్పష్టతలేని నిబంధనలు, అక్రిడేషన్ భారీ కోతలు, మీడియా అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేబుల్ ఛానెల్స్, పార్ట్‌టైం రిపోర్టర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా జీఓ.252ను పునఃసమీక్షించి సవరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తామని హెచ్చరించారు. సమస్త జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్లకు అతీతంగా, ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. జర్నలిస్టులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని, హక్కుల సాధన కోసం ప్రాణ త్యాగానికైనా జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారన్నారు.జీఓ.252లో గజిబిజి నిబంధనలతో జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను మానుకో వాలన్నారు.‘మీడియా అక్రిడేషన్ కార్డు –మీడియా కార్డు’ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, ఏ కార్డు వల్ల ఏ ప్ర యోజనం అనే స్పష్టత లేదని విమర్శించారు. కొత్త నిబంధనలతో 10 వేలకుపైగా అక్రిడేషన్లు కోతపడే ప్రమాదం ఉందని, రిపోర్టర్లు–డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కేబుల్ ఛానెల్స్, పా ర్ట్‌టైం రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జరగనుందని, ఇండిపెండెంట్ జర్నలిస్టుల అనుభవం 10 నుంచి 15 ఏళ్లకు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజారిటీ జర్నలిస్టులు వ్యతి రేకిస్తున్న జీఓ 252ను వెంటనే సవరించాలని, ప్రభుత్వం స్పందించకపోతే దీర్ఘకాలిక ఆందోళనలకు వేనకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, శివకుమార్, అన్నబోయిన మట్టయ్య, మామిడి దుర్గా ప్రసాద్, బి.జనార్ధన్ రెడ్డి, నాగేశ్వర్ రావు, మేకల వరుణమ్మ, సురేష్, లక్ష్మీనారాయణ, సత్య, విజయ్, గాదె రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, గాలెంక గురుపాదం, రవికుమార్, లక్ష్మీనారాయణ, పోటో జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరమణ, ముచర్ల శ్రీనివాస్ గౌడ్, కారింగ్ శ్రీనివాస్ గౌ డ్, దండపల్లి రవికుమార్, మధు, డిజెటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పగడాల సురేష్, ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి లక్ష్మీ నారాయణ, సభ్యులు నరేందర్ రాజు, అజీజ్, నాగరాజు, సురేష్ వెంకటేశ్వర్లు జాకీర్, శ్రీనివాస్, సాయి, శీను, గిరి, టియూడబ్లుజే నియోజకవర్గ అధ్యక్షులు లక్షణ్, కొమ్ముగిరి, ప్రసన్న, ఆంజనేయులు, భిక్షం, వినోద్, సైదులు, జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

