Friday, March 20, 2026

*జూటూరు గ్రామంలో జరిగిన రైతన్న- మీకోసం ఇంటింటి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే- గిత్త.జయసూర్య*

నేటి సాక్షి 25 పాములపాడు:- పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామంలో రైతు “వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల” ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా – మీకోసం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రైతుల ఇంటింటికి తిరిగి రైతన్నా-మీకోసం పాంప్లెట్ పేపర్ లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా అమలుచేసిన పథకాల గురించి ప్రభుత్వ అధికారులు, నాయకులతో కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే-గిత్త.జయసూర్య మాట్లాడుతూ సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం అన్నారు. 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత బస్సు, దీపం-2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సీ, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News