నేటి సాక్షి 14 ఫిబ్రవరి జూపాడుబంగ్లా:- మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దళిత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య105వ జయంతిని పురస్కరించుకొని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులతో కలిసి సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్, మాల మహానాడు అధ్యక్షుడు ఆర్ఎంపీ డాక్టర్ ఎర్రన్న, తదితర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో దళిత తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించాలని వారు కొనియాడారు ఎన్నో రాజకీయ పదవులు చేపట్టి అనుభవించినప్పటికీ నిస్వార్ధంగా నిజాయితీగా నిరాడంబరంగా జీవించారన్నారు అంతే కాకుండా ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు ఆయన చేసిన సేవలకు కర్నూలు జిల్లాలోని పెద్దపాడులొ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్, నక్క మల్లయ్య, బాల నారాయణ గౌడ్, షాలు భాష, మన్సూర్ భాష, వెంకటస్వామి, బాదుల్లా, బ్యాంకు గిరి, తదితరులు పాల్గొన్నారు.

