నేటి సాక్షి 04 జూపాడుబంగ్లా :- రాయలసీమ తలమానికంగా జరిగే శ్రీ రంగనాథ స్వామి జాతర జరిగే గ్రామమైన తర్త్తూరులో ఇంత వరకు దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన 250 కుటుంబాలకు స్మశాన వాటిక లేని పరిస్థితి ఉందని చెరువులో స్మశానం ఉండడం అధికారులకు తగునా అని ఈ సమస్య అధికారులకు కనిపించడం లేదా అని తక్షణమే స్మశానానికి స్థలం కేటాయించకపోతే ఆందోళన తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు హెచ్చరించారు..ఆదివారం తర్తురు గ్రామ ప్రజలతో కలిసి చెరువును తలపిస్తున్న స్మశానాన్ని పరిశీలించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు గ్రామాల్లో స్మశాన వాటికలు లేని పరిస్థితి ఉందన్నారు. ప్రచారాలకు మాత్రమే పరిమితమైన అధికారులు స్మశాన వాటికలకు స్థలాలు ఎందుకు కేటాయించడం లేదని,అక్రమంగా స్థలాలు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా గ్రామ కంఠం భూములు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్న పట్టించుకోవడంలేదని ముఖ్యంగా తర్తురు,, పారుమంచాల గ్రామాల్లో స్మశాన వాటిక లేక గ్రామ ప్రజలు అల్లాడే పరిస్థితి నెలకొందన్నారు.. స్మశాన వాటికలకై సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు పిజిఆర్ఎస్లో దరఖాస్తు చేసిన దృష్టి కేంద్రీకరించడంలో అధికారులు విఫలం చెందుతున్నారన్నారు. గ్రామాల్లో పరిపాలించే నాయకులకు సంబంధించిన స్మశాన వాటిక స్థలాలు ఎలా ఉన్నాయి,దళిత బిసి ల స్మశాన వాటికలు ఎలా ఉన్నాయో పరిశీలన చేయాలన్నారు.. గ్రామాల్లో తారతమ్య బేధాలు లేకుండా అందరికీ స్మశానవాటికలు సమానంగా కేటాయించాలన్నారు.. రెవెన్యూ, అభివృద్ధి,సాంఘిక సంక్షేమ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని లేనిపక్షంలో తమ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు..త్వరలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు భాషా సలీం,తర్తూరు గ్రామస్తులు డ్రైవర్ రంగస్వామి, మంగలి నాగేంద్ర,రవి,తెలుగు వెంకటేశ్వర్లు, గని, మధు, కురువ శేషన్న,తదితరులు పాల్గొన్నారు..

