నేటి సాక్షి 20 ఫిబ్రవరి పాములపాడు :–.. జూపాడుబంగ్లా మండలంలో ఉన్న బస్టాండు గత ఐదు సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉందని ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ డిపో మేనేజర్ పట్టించుకోకపోవడం వల్ల కంపచెట్లతో పనికిరాకుండా పోయిందని ఎండాకాలం సమీపించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగాకుండా బస్టాండ్ పునరుద్ధరణ చేయాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు హెచ్చరించారు.. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో వారు మాట్లాడారు.. జుపాడు బంగ్లా గ్రామ లో ఉన్న బస్టాండు గత ఐదు సంవత్సరాల నుండి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నిరుపయోగంగా మారిందని ప్రస్తుత డిపో మేనేజర్ కూడా బస్టాండ్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని తక్షణమే బస్టాండ్ పునరుద్ధరణ చేయాలని దీనివల్ల ప్రయాణికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారు అన్నారు. నేషనల్ హైవే మండల కేంద్రం పై గుండా పోవడం వల్ల ఎక్స్ప్రెస్ బస్ డ్రైవర్లు ఇదే అదునగా భావించి మండల కేంద్రంలో బస్సులు నిలుపుదల చేయడం లేదని దీనివల్ల ప్రజలు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కచ్చితంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్ శుభ్రం చేసి ప్రయాణికులకు అందుబాటులో ఎండబారిన తగలకుండా ఆర్టీసీ ఉద్యోగిని అక్కడ నియమించి బస్సులు నిలుపుదల చేసి యధాతధంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కలెక్టర్ గార్కి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. డిఎం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మక్బుల్ భాషా, తిరుపతయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..

