Saturday, March 7, 2026

జూపెడ గ్రామంలో నూతన సంత ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి

*నేటి సాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 6 ( మెట్టు రుద్రరాజు )తిరుమలాయపాలెం మండల పరిధిలోని జూపెడ గ్రామంలో గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా సంత ను శుక్రవారం జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సంత నేటినుండి ప్రతి శుక్రవారం రోజున జూపెడ సెంటర్లో సంత కొనసాగుతుందని గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తాజా కూరగాయలు, ఆకుకూరలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతులు తమ పంటలను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడంతో రైతులకు న్యాయమైన ధర లభించనుందని గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ నూతన సంత ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఈ సంత ప్రారంభం తో స్థానిక రైతులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. గ్రామంలో నిత్యావసరాల కొనుగోలు సులభమవడంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి దిశగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తూ సంతను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కూరగాయలకు విక్రయిసించడానికి వచ్చిన మహిళను శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం లో జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు గండ్ర గోపాలరావు ఎంపీటీసీ లంజపల్లి శ్రీనివాస్ గ్రామ వార్డు సభ్యులు అంబాల రామ్మూర్తి లంజపల్లి శ్రీకాంత్ గ్రామ పెద్దలు తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిప్పారెడ్డి లక్ష్మారెడ్డి ఇందుర్తి మల్లారెడ్డి నందిపాటి వెంకన్న బోల్లి కొండ మల్లయ్య బుల్లి కొండ రామచంద్రు పైనంపల్లి రఘునాధపాలెం సోలిపురం బచ్చోడు తండా కాకరవాయి రాజారం ఆయా గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News