నేటి సాక్షి, బెజ్జంకి:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో బెజ్జంకి మండల కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై ప్రజల నమ్మకం మరింత బలపడిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో ఘన విజయాలు సాధించగలదనే నమ్మకం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అక్కరవేణి పోచయ్య, మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, టెంపుల్ చైర్మన్ జెల్లా ప్రభాకర్ యాదవ్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, చానకొండ శరత్, లింగాల శ్రీనివాస్, బొనగం రమేష్ గౌడ్, జేరిపోతుల మధు, పర్సా సంతోష్, బండి వేణు, మచ్చ కుమార్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





