(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 06:)*జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపే లక్ష్యంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ పాల్గొన్నారు.ఆయనతో పాటు ఏఎంసీ వైస్ చైర్మన్ చి.యాదయ్య,గోపాల్ రెడ్డి,స్వామి నాయక్,బాలకృష్ణ,రాకేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని దేప భాస్కర్ పిలుపునిచ్చారు





