(నేటి సాక్షి)జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత మాగంటి గోపినాథ్ భార్య బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేయాలని కోరుతూ ఈరోజు ఉదయం బోరబండ డివిజన్ లో ప్రచారంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





