Wednesday, March 18, 2026

*జూబ్లీహిల్స్ ఎన్నికలో నవీన్ యాదవ్ ఘన విజయం**- మానాలలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..**- సంక్షేమ పథకాలతోనే కాంగ్రెస్ పార్టీ విజయం..**- మండల అధ్యక్షుడు తూం జలపతి…*

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు తూం జలపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తూం జలపతి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అందువల్లే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ స్థాయి గెలుపు సాధ్యం అయిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు నిదర్శనమ‌ని, కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమని వివరించారు. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయని, ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, జక్కు మోహన్, దాసరి అశోక్, బుర్ర నారాయణ గౌడ్, జక్కుల లక్ష్మీ నర్సయ్య, బుర్ర తిరుపతి గౌడ్, లకవత్ బాలు, క్యాతం పెద్ద గంగాధర్, తుమ్ శ్రీనివాస్, తూం తిరుపతి,పాల గణేష్, సంతోష్, బొర్రగల్ల శంకర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News