Wednesday, March 18, 2026

*జూబ్లీహిల్స్ ఎన్నికల విజయం తో జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో సంబురాలు…*—————————————జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం పై హర్షం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించారు.జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ నుండి స్థానిక తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తరలి వెళ్లారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. *జీవన్ రెడ్డి మాట్లాడుతూ*జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు., ఉప ఎన్నికల్లో విజయంతో ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News