నేటి సాక్షి ,నారాయణపేట, నవంబర్ ,14నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా మరికల్ మండల అధ్యక్షులు బెలగొంది వీరన్న, పట్టణ అధ్యక్షులు, హరీష్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు కాటెకొండ ఆంజనేయులు, ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అనంతరం ఇందిరా గాంధీ కూడలిలో విజేత సంబరాలు సందర్భంగా బాన సంచాలన కాల్చి స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు వెలగొంది వీరన్న, హరీష్ కుమార్లు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ విజయం చరిత్ర తిరగరాసారన్నారు. జూబ్లీ హిల్స్ ఓటర్లకు మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతటి విజయం అందించిన జూబ్లీహిల్స్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయమై వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించి కాంగ్రెస్ కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ఒకటి ఒకటిగా నెరవేరుస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని తప్పుడు ప్రచారాలకు ప్రజలు తలవంచరని గుర్తు చేశారు. ఇది ప్రజల యొక్క తీర్పుని ఆయన అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలు జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బెలగొంది వీరన్న, పట్టణ అధ్యక్షులు, హరీష్ కుమార్, యూత్ అధ్యక్షులు కాటెకొండ ఆంజనేయులు, లంబాడి రాములు, నాగరాజు, రామకృష్ణారెడ్డి, పోలమోని రామకృష్ణ,రాఘవేందర్, పెంట మీది రాఘవేందర్, చెన్నయ్య, గోవర్ధన్, పెంట మీది సత్తన్న, జంగిడి రవి, మంగలి రఘు, మాజీ ఎంపిటిసి సీమ గోపాల్, సీమ కమల్, చింతలయ్య, గాజుల మహమ్మద్, బొంత మొగిలి, మంజూరు అహ్మద్, అల్లా బకాష్, రామ్ రెడ్డి, అంజిరెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





