జూరాల వద్ద అదనంగా మరో బ్రిడ్జి నిర్మిస్తాము అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జూరాల వద్ద అదనంగా మరో బ్రిడ్జి నిర్మిస్తాము అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పలు గేట్ల మరమ్మతులు జరగకపోవడం, అవి పని చేయకపోవడం తో ప్రమాదంలో జూరాల అని పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడం, ప్రతిపక్ష పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడంతో.. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీహరి శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాజెక్టులను సందర్శించారు. ముందుగా గద్వాలకు చేరుకున్న మంత్రులు ర్యాలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని నాలుగు టీఎంసీలకు పెంచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
జూరాల ప్రాజెక్టు మీదుగా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు జరుగుతున్న కారణంగా బ్రిడ్జికి ముప్పు వాటిలో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం జరగకుండా ఉండేందుకు వీలుగా అదనంగా ఒక బ్రిడ్జి నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చర్యలు చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూరాల సందర్శన సందర్భంగా ప్రకటించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే వాహనాల రాకపోకలన్ని ఆ బ్రిడ్జి మీద గా జరగనున్నాయి. మంత్రుల వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మెగా రెడ్డి, పరిణికా రెడ్డి, విజయుడు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, కలెక్టర్ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.





