-9 షెటర్లు తెరిచి నీటి విడుదల..
నేటి సాక్షి, దేవరకద్ర జూలై 01
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు జూరాలలో మంగళవారం నీటి ఉధృతి స్థిరంగా ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడం తగ్గుముఖం పడడంతో నీటి ఉధృతి ప్రాజెక్టులో తగ్గింది. దీంతో ప్రాజెక్టు కేవలం 9 షెటర్లను మాత్రమే తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే ప్రాజెక్టు నుండి కోయిల్ సాగర్ కు కృష్ణాజలాలు నీటి సరఫరా కొనసాగుతుంది. ప్రాజెక్టు షెటర్లు తెరవడంతో జిల్లా మూలాల నుండి పర్యాటకులు జూరాలను చూడటానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టు వద్దకు తరలివస్తున్నారు.