Monday, March 16, 2026

*జెరూషలేము శాలలో ఘనంగా క్రిస్టమస్ సంబరాలు యేసుక్రీస్తుకి నీ మనస్సు ఇస్తే ప్రతీ రోజు క్రిస్మస్ పండుగే.. బ్రదర్- శాంసన్ ఏఫ్రా, పాస్టర్ మాణిమల అమ్మ*

నేటి సాక్షి 25 డిసెంబర్ పాములపాడు:— మండల కేంద్రం పాములపాడులోని, జెరూసలేం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ పండుగ వేడుకలు గొప్పగా, ఘనంగా జరిపారు. జెరూసలేం మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు, బ్రదర్-శాంసన్ ఏఫ్రా మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు, మాత్రమే ఈ క్రిస్టమస్ పండుగ కాకుండా, యావత్ ప్రపంచానికి గర్వంగా చెప్పుకోదగ్గ, విశేషమైన పండుగ.క్రిస్మస్ అంటే మొట్ట మొదట వచ్చిన సందేశం భయపడకుడి, ఈరోజు సజీవుని పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాము.ప్రభువు నందు సంతోషంగా ఉంటే ప్రతి రోజు క్రిస్మస్ పండగే.సమర్పణ, మనం మన మనసు నీ దేవునికి, సమర్పించుకోవాలి.ఈ పండుగ నే ఆనందం, సంతోషం.దేవుని లో ఉంటే నిజమైన సంతోషం ఉంటుంది.ఎల్లప్పుడూ సంతోషం గా ఉన్నండి అలాంటి వారికీ ఎప్పుడు యేసయ్య విందే ఇస్తాడు, దేవుని తన పిల్లలకు సంతోష కరమైన శుభవార్త అని నీ ఫలం అధికమవుతుందని, సంతోషకరమైన మనసు ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కాబట్టి క్రిస్మస్ జన్మదినం కాబట్టి అందరూ సంతోషగా ఉండాలి దేవుని సన్మార్గంలో నడవాలన్నారు. అందుకే ఆయన మన సంతోషం కోసం, మన పిల్లల సంతోషం కోసం, అయన తనకు సత్రంలో స్థలం ఇవ్వకపోయినా, యేసుక్రీస్తు పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చుట్టబడి, తొట్టిలో శిశువుగా జన్మించారు. సర్వసృష్టికర్తకు దేవాది దేవుడు, ఆదిసంభూతుడు నిజ దేవుడు, సమస్త జీవరాశికి జీవమును, ఊపిరిని పోసిన వాడు, అని బైబిల్ తెలియజేయుచున్నది అన్నారు. ఈ లోకంలో మానవులందరూ దేవునికి విరోధముగా, వివిధ దోష కార్యములు చేస్తూ, అనగా దేవుడు అసహ్యించుకునే కార్యములు,వ్యభిచారము,దొంగతనములు, దురాలోచనలు, నరహత్యలు, అక్రమ సంపాదనలు, పలు ఈ వ్యర్థమైన మత్తు పదార్థములు స్వీకరించుటవలన పాపములు చేస్తూ దేవునికి దూరమైపోయారన్నారు. కావున సృష్టికర్త అయిన దేవాది దేవుడు. పవిత్రమైన పశువుల పాకలో, మానవాళి కోసం, ఏసుప్రభువు జన్మించడం జరిగిందన్నారు. ఈ క్రిస్మస్ అనగా తానే మానవుడిగా ఈ భూమిపై, పవిత్రమైన జన్మ ఏసుక్రీస్తు జన్మించాడన్నారు. మానవులు నిత్యజీవమును పొందుటకు, శాశ్వతమైన పరిష్కార మార్గమును ప్రేమ,కరుణ, జాలి, దయ, ద్వారా మానవాళిలో ఆనందం నింపిన, ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఈ ఏసుక్రీస్తు జన్మదినమైన, పర్వదినాన్ని ప్రజలంతా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం నింపడానికి, శత్రువులు సైతం మంచి ప్రవర్తనతో, మారుమనస్సు పొంది,ప్రతి ఒక్కరూ నిత్య పరలోక రాజ్యానికి, వారసులు కావాలని ప్రతి ఒక్కరి గుండెల్లో మన ఏసుప్రభువును చేర్చుకుంటే, మన కుటుంబాల్లో ఆయన వెలుగులు ప్రసాదిస్తాడన్నారు. బ్రదర్ శాంసన్ ఏఫ్రా దైవ సందేశం ఇచ్చారు. అంతేకాకుండా, యేసుక్రీస్తు జన్మదినము నాటక ప్రదర్శన చేయడం జరిగింది. . ఈ ప్రార్థన కూడికలో పాస్టర్ మణిమాల అమ్మ దైవ సందేశం ఇచ్చి, పాటలు పాడి, దేవుని స్తుతించడం జరిగింది. వచ్చిన 2వేల మంది విశ్వాసులకు ఆశీర్వాద భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘా ఇంచార్జెస్, సేవకులు పేతురు, యాకోబు, కరుణాకర్, అజయ్, బాలు, రాజ్ కుమార్, జోషి,డక్క.శ్రీకాంత్, మరియు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొని. విజయవంతం చేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News